'నేతాజీ క్యాప్ మిస్సింగ్' అంటూ ట్వీట్.. స్పందించిన కేంద్రం
Netaji cap not 'missing' from Red Fort. ఢిల్లీలోని ఎర్రకోటలో 2019లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం ఏర్పాటు చేసిన మ్యూజియానికి
By Medi Samrat Published on
28 Jun 2021 4:38 AM GMT

ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం 2019లో ఏర్పాటు చేసిన మ్యూజియానికి.. నేతాజీ వారసులు ఆయన వినియోగించిన టోపీని అందించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ టోపీని కేంద్రం ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాకు తరలించింది. టోపీని తరలించడంపై చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము బహూకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోపీని అన్ని చోట్లకు తరలించడం సరికాదని.. ఆ టోపీని ఎర్రకోటలోనే భద్రంగా ఉంచాలని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ట్వీట్ చేశారు. ట్వీట్‌కు 'నేతాజీ క్యాప్ మిస్సింగ్' హ్యాష్‌ట్యాగ్ జతచేశారు.
అయితే.. చంద్రకుమార్ బోస్ చేసిన ట్వీట్ పై కేంద్రం స్పందించింది. ఆ టోపీ భద్రంగానే ఉందని, కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో ప్రత్యేక దర్శనం కోసం తరలించామని పేర్కొంది. ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. నేతాజీ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా.. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ప్రదర్శన కోసమే టోపీని తరలించినట్టు చెప్పారు. జులై 18 తర్వాత తిరిగి ఎర్రకోటకు తీసుకొచ్చి భద్రపరుస్తామని పేర్కొన్నారు.
Next Story