నెహ్రూ రిజర్వేషన్స్ కు వ్యతిరేకం : ప్రధాని మోదీ

ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  7 Feb 2024 9:45 PM IST
నెహ్రూ రిజర్వేషన్స్ కు వ్యతిరేకం : ప్రధాని మోదీ

దళితులు, వెనుకబడినవారు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుందని.. ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ, ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి మాట్లాడకూడదని అన్నారు.

ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇవ్వలేదు.. సాధారణ కేటగిరీలోని పేదలకు రిజర్వేషన్లు అసలు ఇవ్వలేదు.. ఇక బాబా సాహెబ్‌ను భారతరత్నకు అర్హుడని కూడా భావించలేదన్నారు ప్రధాని మోదీ. కేవలం తన కుటుంబానికి మాత్రమే భారతరత్న ఇస్తూ వచ్చారు.. అలాంటి వాళ్లు ఇప్పుడు మనకు బోధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖను గురించి కూడా మోదీ ప్రస్తావించారు. "నెహ్రూ నాకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఇష్టం లేదు. ముఖ్యంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. అసమర్థతను ప్రోత్సహించకూడదు.. ఇలాంటి చర్యలకు నేను వ్యతిరేకం" అని అన్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగాలలో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు కోటాలు వస్తే ప్రభుత్వ పని ప్రమాణాలు పడిపోతాయని నెహ్రూ జీ చెప్పేవారని ప్రధాని మోదీ అన్నారు.

Next Story