NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది

By Medi Samrat  Published on  2 Nov 2024 7:58 PM IST
NEET PG 2024: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. MCC అధికారిక వెబ్‌సైట్‌ లో షెడ్యూల్‌ వివరాలను చూడొచ్చు.

షెడ్యూల్ ప్రకారం సీట్ మ్యాట్రిక్స్ వెరిఫికేషన్ నవంబర్ 7న నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఫిల్లింగ్, లాకింగ్ ప్రక్రియ నవంబర్ 8న ప్రారంభమై నవంబర్ 17న ముగుస్తుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 18న ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది. మొదటి రౌండ్ ఫలితాలు నవంబర్ 20న ప్రకటిస్తారు. ఈ రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 21- నవంబర్ 27 మధ్య రిపోర్ట్ చేయాలి.

MCC నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2024 కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచారు. అయితే, ఈ విండో భారతీయుల నుండి నాన్-రెసిడెంట్ ఇండియన్‌గా మారాలనుకునే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఆశావాదుల కోసం మాత్రమే అని తెలిపారు. అప్లికేషన్ విండోను నవంబర్ 1 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచారు. అభ్యర్థులు తమ జాతీయతను ఇండియన్ నుండి ఎన్‌ఆర్‌ఐగా మార్చుకోవాలనే వారు సంబంధిత పత్రాలను ఇ-మెయిల్ ద్వారా nri.adgmemcc1@gmail.com కు పంపాలి

Next Story