అర్ధరాత్రి ఎన్డీఆర్‌ఎఫ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

NDRF Twitter handle gets briefly hacked. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌ చేయబడింది. జనవరి 22, శనివారం అర్థరాత్రి నాడు హ్యాక్ చేయబడిందని

By అంజి  Published on  23 Jan 2022 10:38 AM IST
అర్ధరాత్రి ఎన్డీఆర్‌ఎఫ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌ చేయబడింది. జనవరి 22, శనివారం అర్థరాత్రి నాడు హ్యాక్ చేయబడిందని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. "జనవరి 22, శనివారం NDRF ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేయబడింది. మేము దానిని వెంటనే పరిశీలిస్తాము" అని డీజీ కర్వాల్‌ తెలిపారు. ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు సాంకేతిక నిపుణుల బృందం పని చేస్తోందన్నారు. ఇటీవల కాలంలో భారత్‌కు చెందిన ప్రముఖ ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌కు గురవుతుండటం కలకలం రేపుతోంది. జనవరి 12వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికార ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా హ్యాక్‌ అయ్యింది. ఆ తర్వాత దానికి ఎలన్‌మస్క్‌ అని పేరు మార్చి 50కిపైగా వరుస ట్వీట్లు చేశారు. అయితే, ఖాతాను పునరుద్ధరించినట్లు మంత్రిత్వ శాఖ తర్వాత స్పష్టం చేసింది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కూడా దుండగులు హ్యాక్‌ చేశారు. వారు ప్రధాని మోడీ ఖాతా నుండి వివాదాస్పద క్రిప్టోకరెన్సీని ప్రచారం చేస్తూ ట్వీట్లను పంచుకున్నారు. తర్వాత ఖాతా పునరుద్ధరించబడింది.

భారతదేశం "బిట్‌కాయిన్‌ను అధికారికంగా చట్టబద్ధమైన టెండర్‌గా స్వీకరించింది" అని పిఎం మోడీ హ్యాండిల్ నుండి విడుదల చేసిన ట్వీట్ పేర్కొంది. లింక్‌ను షేర్ చేస్తూ, "త్వరపడండి" అని ప్రజలను కోరుతూ, "ప్రభుత్వం అధికారికంగా 500 బిట్‌కాయిన్లని కొనుగోలు చేసింది. దేశ ప్రజలకి పంపిణీ చేస్తోంది" అని ట్వీట్ జోడించారు. ఈ విషయంపై వివరాలను తెలియజేస్తూ.. సైబర్ సెక్యూరిటీ సంఘటనలు, బెదిరింపులను పర్యవేక్షించే జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (సెర్ట్-ఇన్), ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌పై దర్యాప్తు చేయడానికి ట్విట్టర్, గూగుల్‌ను సంప్రదిస్తామని తెలిపింది. ప్రభుత్వ అధికారుల ఖాతాలను హ్యాక్ చేయడం భారతదేశంలోనే సాధారణ దృగ్విషయం కాదు. గతేడాది జులైలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌ల ట్విట్టర్ ఖాతాలు కూడా హ్యాక్ చేయబడ్డాయి.

Next Story