ఆ ప్రాంతాల్లో చికెన్ అమ్మడానికి వీలు లేదు..!

NDMC Ban Chicken Sales. దేశాన్ని ప్రస్తుతం బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే పలు రాష్ట్రాలను

By Medi Samrat  Published on  14 Jan 2021 5:10 AM GMT
ఆ ప్రాంతాల్లో చికెన్ అమ్మడానికి వీలు లేదు..!

దేశాన్ని ప్రస్తుతం బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే పలు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ తాకగా.. చికెన్ అమ్మకాలు చాలా వరకూ తగ్గిపోయాయి. ధరలు కూడా చాలా తగ్గాయి. పలు రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులపై ఆంక్షలు విధించగా కొన్ని ప్రాంతాల్లో ఏకంగా చికెన్ ను అమ్మడానికి.. వాటితో చేసిన పదార్థాలు తినకుండా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చికెన్‌ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దేశ రాజధానిలో బర్డ్‌ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పౌల్ట్రీ షాపులు, మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అమ్మకాలు జరుపకూడదని అంటున్నారు అధికారులు.

బర్డ్‌ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ హోల్‌సేల్‌ మార్కెట్లు మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఎన్‌డీఎంసీ ప్రకటనలో తెలిపింది. చికెన్‌, కోడిగుడ్లతో కూడిన వంటకాలు వడ్డించకూడదని రెస్టారెంట్ల యజమానులకు తెలిపామని.. నిబంధనలు అతిక్రమించిన వారి ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని ఎన్‌డీఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో ఉడికిన మాంసం, గుడ్లు తినవచ్చని ఆరోగ్య శాఖ మరో వైపు చెబుతోంది. కానీ మున్సిపల్‌ కార్పొరేషన్లు వేరే విధంగా చర్యలు తీసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్లు తినచ్చో లేదో అనే సంశయంలో పడ్డారు.


Next Story