శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్

NCP patron Sharad Pawar tests Covid-19 positive. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత‌ శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్ గా

By Medi Samrat
Published on : 24 Jan 2022 7:41 PM IST

శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత‌ శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. నా ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ సూచించిన చికిత్సను పాటిస్తున్నాను.. ఇటీవ‌ల నాతో క‌లిసిన వారంద‌రూ టెస్టులు చేయించుకుని.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని 81 ఏళ్ల శరద్ పవార్‌ ట్వీట్ చేశారు. 1940, డిసెంబర్ 12న జ‌న్మించిన శరద్ పవార్ మహారాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు దేశ రాజ‌కీయాల‌లో కీల‌క‌మైన వ్య‌క్తిగా ఎదిగారు. ఆయ‌న‌ విద్యార్థిగా ఉన్న‌ప్పుడే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న 13వ లోక్ సభ ఎన్నికలు వచ్చిన తరువాత కొన్ని రాజకీయ కారణాల వల్ల పవార్‌, సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.



Next Story