ఆర్యన్‌ బెయిల్‌పై నవాబ్‌ మాలిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా అంటూ..!

Ncp leader nawab malik reacts aryan khan gets bail. ముంబై డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది.

By అంజి  Published on  28 Oct 2021 8:23 PM IST
ఆర్యన్‌ బెయిల్‌పై నవాబ్‌ మాలిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..  సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా అంటూ..!

ముంబై డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. గురువారం నాడు ఆర్యన్‌ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్యన్‌ 20 రోజుల పాటు జైలులో గడిపాడు. గతంలో మూడు సార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. మూడు సార్లు కూడా కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ఆర్యన్‌ ఖాన్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలికి ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ రావడంతో నవాబ్‌ మాలిక్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. షారుక్‌ ఖాన్‌ ఓం శాంతి ఓం మూవీలోని డైలాగ్‌ను "సినిమా అప్పుడే అయిపోలేదు మిత్రమా" ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ సమీర్‌ వాంఖడేని ఉద్దేశించే నవాబ్‌ మాలిక్‌ పోస్టు చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్యన్‌తో పాటు ఆర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధమేచాలకు సింగిల్‌ బెంచ్‌ జస్టిస్‌ ఎన్‌వీసంబ్రే బెయిల్‌ మంజూరు చేశారు.


Next Story