ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. వచ్చే నవరాత్రి నాటికి నక్సలిజం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్ షా అన్నారు. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను అమిత్ షా కోరారు.
మావోయిస్టులు ఆయుధాలు వీడాలని అమిత్ షా పిలుపునిచ్చారు. 2026 మార్చి నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయన్నారు. మావోయిస్టులు మనలో భాగమేనని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం ఉండదని అన్నారు.