భారత నావికాదళానికి చెందిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) బుధవారం ముంబై తీరంలో అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ తీరానికి చేరువలో సాధారణ ఆపరేషన్‌లో ఉందని నేవీ ప్రతినిధి తెలిపారు. రొటిన్ ఫ్లైయింగ్ మిషన్‌లో భాగంగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ దిగినట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న ముగ్గురు సిబ్బందిని నౌకాదళ పెట్రోలింగ్ క్రాఫ్ట్ సురక్షితంగా రక్షించింది. ఘటనపై విచారణకు ఆదేశించారు.
'ధృవ్' హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు.