పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఒక వ్యక్తి పతనం అతను రాజీ పడటం ద్వారా ప్రారంభమవుతుందని తన రాజీనామా లేఖలో సిద్దూ తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం విషయంలో తాను ఏ మాత్రం రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి మాత్రం సేవ చేస్తానని తెలిపారు.
ఇటీవలి కాలంలో పంజాబ్ కాంగ్రెస్ లో ఎన్నో సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధూ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది నెలలకే అమరీందర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు సిద్ధూ కాంగ్రెస్ చీఫ్ పదవిని వదులుకుంది. నేను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్‌కు సేవ చేస్తూనే ఉంటానని నవజ్యోత్ సిద్ధూ చెప్పారు.