మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన‌ నవీన్ ప‌ట్నాయ‌క్‌ కొత్త టీమ్‌

Naveen's new team 13 cabinet ministers, 8 state ministers take oath. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం తన మంత్రివర్గాన్ని పునరుద్ధరించారు.

By Medi Samrat  Published on  5 Jun 2022 2:52 PM IST
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన‌ నవీన్ ప‌ట్నాయ‌క్‌ కొత్త టీమ్‌

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం తన మంత్రివర్గాన్ని పునరుద్ధరించారు. అంత‌కుముందు సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ మొత్తం 20 మంది మంత్రులను తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. పునరుద్ధరించిన కేబినెట్‌లో 13 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వగా, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాఖల మంత్రి పదవులు లభించాయి.

కేబినెట్ మంత్రిగా జగన్నాథ సారక తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. ఐదుసార్లు ఎమ్మెల్యే, సీనియర్ బీజేడీ నాయ‌కుడు నిరంజన్ పూజారి కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అథాగఢ్ ఎమ్మెల్యే రణేంద్ర ప్రతాప్ స్వైన్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, ఔల్ ఎమ్మెల్యే ప్రతాప్ దేబ్, ప్రఫుల్ల మల్లిక్, మహాకల్పాడ ఎమ్మెల్యే అతాను సబ్యసాచి నాయక్ కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 8 ఏళ్ల తర్వాత నవీన్ మంత్రివర్గంలోకి నాయక్ తిరిగి వచ్చారు.

సీనియర్ నాయకుడు, బౌధ్ ఎమ్మెల్యే ప్రదీప్ అమత్ కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఝార్సుగూడ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి నబా దాస్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. భువనేశ్వర్ ఎమ్మెల్యే అశోక్ చంద్ర పాండా ఈసారి కేబినెట్‌లోకి పదోన్నతి పొందారు. టిట్లగత్ ఎమ్మెల్యే తుకుని సాహు కూడా నవీన్ క్యాబినెట్‌లో మంత్రిగా బెర్త్ పొందారు. నుపాడ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేంద్ర ధోలాకియా కేబినెట్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. పాఠశాల, సామూహిక విద్యా శాఖ పోర్ట్‌ఫోలియోను నిర్వహించిన నిమపారా ఎమ్మెల్యే సమీర్ రంజన్ దాష్ రాష్ట్ర మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్ర మంత్రులుగా (స్వతంత్ర బాధ్యతలు) ప్రమాణస్వీకారం చేసిన ఇతరులలో- జలేశ్వర్ ఎమ్మెల్యే అశ్విని పాత్ర, ప్రీతిరంజన్ ఘరాయ్, పోల్సర ఎమ్మెల్యే శ్రీకాంత సాహూ, కాకత్‌పూర్ ఎమ్మెల్యే తుషారకంటి బెహెరా, రైరాఖోల్ ఎమ్మెల్యే రోహిత్ పూజారి, బీజేపూర్ ఎమ్మెల్యే రీటా సాహు మరియు కరంజియా ఎమ్మెల్యే బసంతి హెంబ్రామ్ ఉన్నారు.

కొత్త మంత్రివర్గం పూర్తి జాబితా..

కేబినెట్ మంత్రులు :

జగన్నాథ్ సారకా

నిరంజన్ పూజారి

రణేంద్ర ప్రతాప్ స్వైన్

ప్రమీలా మల్లిక్

ఉషా దేవి

ప్రఫుల్ల కుమార్ మల్లిక్

ప్రతాప్ కేశరి దేబ్

అతను సబ్యసాచి నాయక్

ప్రదీప్ కుమార్ అమత్

నాబా కిషోర్ దాస్

అశోక్ చంద్ర పాండా

తుకుని సాహు

రాజేంద్ర ధోలాకియా

రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

సమీర్ రంజన్ దాష్

అశ్విని కుమార్ పాత్ర

ప్రీతిరంజన్ ఘడాయ్

శ్రీకాంత సాహు

తుషారకాంతి బెహెరా

రోహిత్ పూజారి

రీటా సాహు

బసంతి హెంబ్రం

























































































Next Story