కేంద్రం అనుసరిస్తున్న "కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు" నిరసనగా మార్చి 28, 29 తేదీలలో కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరమ్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. మార్చి 22న కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక సమావేశం అనంతరం సమ్మెకు పిలుపునిచ్చాయి. బంద్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. రవాణా కార్మికులు, విద్యుత్ కార్మికులు నిరసనలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫోరం తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకింగ్, బీమా సేవలకు చెందిన ఉద్యోగులు కూడా బంద్‌లో ఫాల్గొననున్నారు.
సమ్మె నేఫథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మార్చి 28, 29 తేదీలలో సేవలకు అంతరాయం ఏర్పడనుందని ఇప్పటికే పేర్కొంది. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్ను, రాగి రంగాలకు చెందిన ఉద్యోగ యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయని ఫోరం పేర్కొంది. సమ్మెకు మద్దతుగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు కూడా పెద్దఎత్తున ఉద్యమించనున్నాయని పేర్కొంది. అయితే, మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ సమ్మెలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నందున.. పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మార్చి 28, 29 తేదీలలో ఉద్యోగులను విధులకు హాజరు కావాలని కోరింది.