రాజస్థాన్‌లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద అమ్మాయిలకు తీవ్ర అవమానం జరిగింది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు నిబంధనలు తెలియక ఫుల్‌హ్యాండ్ దుస్తులు వేసుకొని రావడంతో.. పురుషు సిబ్బందితో స్లీవ్ కట్ చేయించారు. ఈ ఘటన బికనీర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బికనీర్‌లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు కొందరు అమ్మాయిలు నిబంధనలు తెలియక ఫుల్‌హ్యాండ్స్ దుస్తులు వేసుకొని వచ్చారు. దీంతో అక్కడి అధికారులు సిబ్బందితో వారి స్లీవ్స్‌ను కట్ చేయించారు.
అయితే విద్యార్థినిలకు కొందరు మహిళలు స్లీవ్స్ కట్ చేయగా, మరికొందరు పురుష సిబ్బంది స్లీవ్ కట్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మహిళలను అవమానించే ఘటనగా కమిషన్ పేర్కొంది. రాజస్థాన్ ప్రభుత్వం తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీకి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ లేఖ రాశారు. అమ్మాయి స్లీవ్స్ కట్ చేయించిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.