మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు

ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు.

By -  Knakam Karthik
Published on : 7 Oct 2025 11:11 AM IST

National News, Delhi, PM Narendra Modi

మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు. అక్టోబర్ 7, 2001న ఆయన తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజునుంచి ప్రారంభమైన ప్రజాసేవా యాత్ర నేటితో 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా మోదీ ఎక్స్ (ట్విటర్)‌లో స్పందిస్తూ, “2001లో ఈ రోజున నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు భారత ప్రజల ఆశీర్వాదాలతో ప్రభుత్వ నాయకుడిగా 25వ సంవత్సరం ప్రారంభిస్తున్నాను. దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఈ మహా దేశ అభివృద్ధికి తోడ్పడడం నా నిరంతర ప్రయత్నం” అని పేర్కొన్నారు.

మోదీ 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అనంతరం 2014 మేలో దేశ ప్రధాని పదవిని స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నిరంతరంగా భారత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు.

Next Story