జమ్మూకశ్మీర్ డీజీపీగా రియల్ లైఫ్ సింగం..!
జమ్మూకశ్మీర్ కొత్త స్పెషల్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్‌ను కేంద్ర హోంశాఖ నియమించింది.
By Medi Samrat Published on 15 Aug 2024 10:30 AM GMTజమ్మూకశ్మీర్ కొత్త స్పెషల్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్‌ను కేంద్ర హోంశాఖ నియమించింది. ప్రస్తుత డీజీపీ ఆర్.ఆర్.స్వైన్ స్థానంలో ఆయన సెప్టెంబర్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఉగ్రవాద ఘటనలపై అణచివేతే లక్ష్యంగా కేంద్రం నుంచి ఈ ఉత్తర్వులు వచ్చాయి. అయితే నళిన్ ప్రభాత్ ఎవరు.. ఆయన నేపథ్యం ఏమిటి అనేది ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఆయన గురించి తెలుసుకుందాం.
నళిన్ ప్రభాత్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ IPS అధికారి. 55 ఏళ్ల నళిన్ ప్రభాత్‌కు ఇప్పటికే మూడుసార్లు పోలీస్ గ్యాలంటరీ మెడల్ అందుకున్నారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక నక్సల్ వ్యతిరేక పోలీసు దళం 'గ్రేహౌండ్స్'కి నాయకత్వం వహించారు. ప్రభాత్ CRPFలో కూడా విస్తృతంగా పనిచేశారు. IG ఆపరేషన్స్, ADGగా కాశ్మీర్ ప్రాంత విస్తరణకు నాయకత్వం వహించారు. దీన్ని బట్టి చూస్తే నళిన్‌కు జమ్మూ కాశ్మీర్ కొత్త ప్రాంతం కాదని ఇట్టే అర్థమవుతుంది. సెప్టెంబర్ 30న RR స్వైన్ పదవీ విరమణ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు తీసుకుంటారు. ప్రభాత్‌కు మూడేళ్లపాటు AGMUT క్యాడర్‌ను కూడా కేటాయించారు.
నళిన్ ప్రభాత్ హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారు. ఆయన 1968 మార్చి 14న రాష్ట్రంలోని తుంగ్రి గ్రామంలో జన్మించారు. నళిన్ ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎం.ఏ పూర్తిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలలో అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్‌లో CRPF అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా అలాగే CRPF IGPగా పనిచేశారు.