నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) అధికారంలో ఉన్న ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27 న ఎన్నికలు జరుగనున్నాయి. నాగాలాండ్‌లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27న ఓట్ల పోలింగ్, మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
నోటిఫికేషన్ జారీ తేదీ : జనవరి 31
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 7
నామినేషన్ల పరిశీలన తేదీ: ఫిబ్రవరి 8
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ : ఫిబ్రవరి 10
పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 27
కౌంటింగ్ తేదీ : మార్చి 2
నాగాలాండ్ శాసనసభలో 60 స్థానాలు ఉన్నాయి. అధికార కూటమిగా యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (UDA)లో NDPP, BJP , నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) ఉన్నాయి. 2018 ఎన్నికలకు ముందు ఏర్పడిన ఎన్‌డిపిపి-బిజెపి కూటమి నాగాలాండ్‌లో బలంగా కొనసాగుతోంది. నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేదు. 21 మంది NPF ఎమ్మెల్యేలు UDAలో చేరారు. 2018లో ఎన్‌పీఎఫ్‌కి 26, ఎన్‌డీపీపీకి 18, బీజేపీకి 12, ఎన్‌పీపీకి 2, జేడీయూకి 1, స్వతంత్రులకు 1 సీటు వచ్చాయి. బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నలిన్ కోహ్లి ప్రకారం.. బిజెపి, ఎన్‌డిపిపితో పొత్తును కొనసాగించాలని చూస్తోంది. ఈ ఎన్నికలలో 40:20 సీట్ల షేరింగ్ మాడ్యూల్‌తో ముందుకు సాగవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.