బీరెన్‌ సింగ్‌కు రెండోసారి అవ‌కాశ‌మిచ్చిన బీజేపీ

N Biren Singh to take oath as Manipur chief minister again. మణిపూర్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌. బీరెన్‌ సింగ్‌ను బీజేపీ రెండోసారి ఎంపిక చేసింది.

By Medi Samrat  Published on  20 March 2022 5:04 PM IST
బీరెన్‌ సింగ్‌కు రెండోసారి అవ‌కాశ‌మిచ్చిన బీజేపీ

మణిపూర్‌ ముఖ్యమంత్రిగా ఎన్‌. బీరెన్‌ సింగ్‌ను బీజేపీ రెండోసారి ఎంపిక చేసింది. ఆదివారం ఇంఫాల్‌లో జరిగిన మణిపూర్ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీరెన్‌ సింగ్‌ సీఎం పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బీరేన్ సింగ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడాన్ని స్వాగతిస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "ఇది అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న మంచి నిర్ణయం. మణిపూర్‌లో సుస్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఇది నిర్ధారిస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి నిర్మ‌లా సీతారామన్ ఆదివారం ఇంఫాల్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశానికి హాజరయ్యారు.

మణిపూర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాల‌కు గానూ 32 సీట్లు గెలుచుకుంది. ఇక బీరెన్ సింగ్ హీనాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. మణిపూర్‌ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే విష‌య‌మై తీవ్ర ఊహాగానాలు సాగాయి. బీరేన్ సింగ్ ఈ పదవికి ప్రధాన పోటీదారుగా ఉండగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ క్యాబినెట్ మంత్రి బిశ్వజిత్ సింగ్ కూడా పోటీలో ఉన్నట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. సీఎం రేసులో ఉన్న‌ బీరెన్ సింగ్, బిశ్వజిత్ సింగ్ ఇద్దరూ బీజేపీ కేంద్ర నాయకత్వంతో భేటీ నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు.









Next Story