చిన్న పిల్లల చేతుల్లో ఏమున్నాయో గమనిస్తూ ఉండాలి.. లేకపోతే..

Mysuru Girl Baby Coin. చిన్న పిల్లల చేతుల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో గమనిస్తూ ఉండాలి..! ఎందుకంటే వారు

By Medi Samrat  Published on  7 Sept 2021 12:34 PM IST
చిన్న పిల్లల చేతుల్లో ఏమున్నాయో గమనిస్తూ ఉండాలి.. లేకపోతే..

చిన్న పిల్లల చేతుల్లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో గమనిస్తూ ఉండాలి..! ఎందుకంటే వారు చేతిలో నుండి నోట్లోకి పెట్టేసుకునే అవకాశం లేకపోలేదు. అలా వాళ్లు నోట్లో పెట్టుకున్న వస్తువుల కారణంగా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి నోట్లో 5 రూపాయల కాయిన్ ఉండిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కాస్తా పోయాయి. దీంతో ఆమె కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. నాలుగేళ్ల చిన్నారి గొంతులో 5 రూపాయల కాయిన్ ఉండిపోవడంతో మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కాయిన్ మింగిందని కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఖుషీని మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖుషీ మరణించింది.

Next Story