మా మంత్రులకు హిందీ రాదు.. వారితో మాకు ఇబ్బంది అవుతోంది.. కేంద్రానికి సీఎం లేఖ..!

My ministers dont know hindi mizoram cm Zoramthanga. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ లెటర్‌ రాశారు. తమ కేబినెట్‌లో ఉన్న మినిస్టర్లకు హిందీ

By అంజి  Published on  9 Nov 2021 3:27 PM IST
మా మంత్రులకు హిందీ రాదు.. వారితో మాకు ఇబ్బంది అవుతోంది.. కేంద్రానికి సీఎం లేఖ..!

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ లెటర్‌ రాశారు. తమ కేబినెట్‌లో ఉన్న మినిస్టర్లకు హిందీ లాంగ్వేజ్‌ రాదని లేఖలో పేర్కొన్నారు. దీంతో చీఫ్‌ సెక్రటరీతో తమకు ఇబ్బంది అవుతోందని అన్నారు. చీఫ్‌ సెక్రటరీ రేణూ శర్మకు మిజో లాంగ్వేజ్‌ రాదాని, ఆమెను మార్చాలని ముఖ్యమంత్రి పూ జోరంతంగ లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్‌నున్‌మావియా చువాగో పదవీ విరమణ తర్వాత తన దగ్గర అదనపు చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జేసీ రామ్‌తంగను కొత్త చీఫ్‌ సెక్రటరీగా నియమించాలని అమిత్‌షా అభ్యర్థించారు.

మిజోరాం ప్రజలకు హిందీ లాంగ్వేజ్ అర్థం కాదన్నారు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు ఒక్కరికీ హిందీ రాకపోగా.. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌తో కూడా సమస్య ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మీజో లాంగ్వేజ్‌ తెలియని వ్యక్తి చీఫ్‌ సెక్రటరీగా.. హిందీ, ఇంగ్లీష్‌ రాని మంత్రులతో పని చేయడం ఇబ్బందిగా మారుతుందని అమిత్‌షాకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. పైగా రాష్ట్రం ఏర్పడి నాటి నుండి మిజో భాష తెలిసిన వ్యక్తులనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సీఎస్‌లుగా నియమిస్తూ వస్తోందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ భాష తెలియని వ్యక్తిని సీఎస్‌గా నియమించరని అన్నారు. ఈ నెల 1వ తేదీన మిజోరాం సీఎస్‌గా బాధ్యతలు చేపట్టాలని రేణూ శర్మకు కేంద్రం ప్రభుత్వం ఆర్డర్స్‌ ఇచ్చింది.

అదే రోజున చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాలని జేసీ రామ్‌తంగాను ముఖ్యమంత్రి జోరంతంగా ఆదేశించారు. దీంతో మిజోరాం రాష్ట్రానికి ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌ మార్చాలని అమిత్‌షాకు సీఎం లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ విశ్వాస భాగస్వాముల్లో తాము కూడా ఒకరమని, మా అభ్యర్థనను కేంద్రం అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ తమ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే విపక్షాల ముందు తమ నమ్మకాన్ని అపహస్యం చేసినట్లువుతుందన్నారు. ఈ లేఖను మిజోరాం ముఖ్యమంత్రి అక్టోబర్‌ 29న అమిత్‌షాకు రాశారు. తాజాగా ఇది వెలుగులోకి రాగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

Next Story