నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ చేశారు : ప్రియాంక సంచలన ఆరోపణలు
My children's Instagram accounts hacked. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని
By Medi Samrat Published on 21 Dec 2021 1:31 PM GMTకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని మంగళవారం తెలిపారు. ప్రభుత్వం తన పిల్లలను వేటాడుతుందని ప్రియాంక ఆరోపించింది. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారికి వేరే పని లేదా? అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రియాంక గాంధీ వాద్రాకు ఇద్దరు పిల్లలు కాగా.. కూతురు మిరాయా వాద్రా(18), రైహాన్ వాద్రా (20). వీరు చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు.
ఈ సందర్భంగా యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రియాంక పరోక్షంగా ప్రస్తావించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఫోన్ ట్యాపింగ్'కు పాల్పడ్డారని ఆరోపించారు. మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు.. మా సంభాషణలు రికార్డ్ చేస్తున్నారు.. పార్టీ ఆఫీసులోని ఫోన్లన్నీ వింటున్నారు.. సాయంత్రం కొన్ని రికార్డింగ్ లను స్వయంగా సీఎం వింటున్నారుని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బహుశా అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ ఇలాంటివే చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని కౌంటరిచ్చారు.
మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ 'నారీ శక్తి' గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. యుపీలోని రాయ్‌బరేలీలో తన 'లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్ శక్తి సంవాద్' కారణంగా.. పీఎం మోదీ మహిళా సాధికారతపై దృష్టి సారించారని అన్నారు. మహిళలు మేల్కొన్నారు.. దేశ శక్తి ముందు ప్రధాని తలవంచారు. ఇది ఉత్తరప్రదేశ్ మహిళల విజయం. నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు.