ముస్లిం యువతుల వివాహ వయస్సుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ముస్లిం యువతి వయస్సు 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన యువకుడిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని.. అందుకనే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలని తేల్చి చెప్పింది. 16, 21 సంవత్సరాల వయస్సు గల ముస్లిం జంటకు వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పిస్తూ, పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం నాడు ఈ తీర్పు ఇచ్చింది.
రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతులు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల ప్రకారం వారి వివాహం జూన్ 8, 2022న ముస్లిం ఆచారాల ప్రకారం జరిగింది. అయితే, వారి కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వారి అనుమతి లేకుండా వివాహం చేసుకున్నందుకు వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.