ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయ‌స్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!

మ‌హిళ‌ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది.

By Medi Samrat  Published on  7 Feb 2025 2:31 PM IST
ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయ‌స్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!

మ‌హిళ‌ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది. కోర్టు తీర్పుతో మ‌హిళ‌ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ రోజు నా సోదరికి న్యాయం జరిగిందని, ముగ్గురు నిందితులను ఉరికి వేలాడుతున్న రోజు నేను మరింత సంతోషిస్తానని చెప్పాడు. ముగ్గురూ కలిసి నా సోదరి గొంతు నులిమి చంపారని సోదరుడు చెప్పాడు. ఆ బాధను అనుభ‌విస్తున్న‌ నా గుండె పగిలిపోతుంది. కోర్టు ఇచ్చిన నిర్ణయంతో నేను పూర్తిగా సంతృప్తి చెందానని పేర్కొన్నాడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బ‌రేలి ద‌గ్గ‌ర‌లోని ఓ గ్రామంలో ముసబ్బర్ కుటుంబం ఉంటుంది. మృతురాలి తండ్రి మానసిక పరిస్థితి బాగోలేకపోవ‌డంతో త‌మ్ముడే(ముసబ్బర్).. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసే బాధ్యతను తీసుకున్నాడు. చెల్లెలు భర్త, దోషి మక్సద్ అలీ మంచాలు అమ్మేవాడు. ముసబ్బర్ పెళ్లికి తన శక్తికి మించి కట్నం కూడా ఇచ్చాడు. అయినా కూడా మక్సద్ అలీ, అతని కుటుంబ స‌భ్యులు అద‌న‌పు క‌ట్నం డిమాండ్ చేశారు. నేను ఆ డిమాండ్‌ను నెరవేర్చలేకపోవడంతో.. దుండగులు నా సోదరిని దారుణంగా హత్య చేశారని ముసబ్బర్ పేర్కొన్నాడు. న్యాయస్థానం దోషులకు మరణశిక్ష విధించిగా.. ముసబ్బర్ గ‌ట్టిగా ఊపిరి పీల్చుకుని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశాడు.

న్యాయస్థానం తీర్పు వెలువ‌రిస్తూ.. ఎవరైనా మన జేబులోని పెన్ను అడిగితేనే.. దానిని ఇవ్వడానికి వెనుకాడతాము. ఆడపిల్లలు ఉన్న వ్యక్తుల హృదయం ఎలా ఉంటుంది.. వారి హృద‌యంలోని కొంత బాగాన్నే ఇస్తార‌ని కోర్టు పేర్కొంది. భావి తరానికి మంచి విలువల‌ను, మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని కోర్టు పేర్కొంది. స్వామి వివేకానంద గురించి ప్రస్తావిస్తూ.. ఒక దేశ పురోగతికి అత్యుత్తమ కొలమానం మహిళల పట్ల మ‌గ‌వారి ప్రవర్తన అని అన్నారు. మహిళలపై నేరాలు మహిళల ఆత్మగౌరవం, గౌరవాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, సామాజిక అభివృద్ధి వేగాన్ని కూడా అడ్డుకుంటుందని పేర్కొంది.

Next Story