సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం బైక్ పై పిచ్చి వేశాలు

Mumbai Police reacts to bike stunt video. బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే

By Medi Samrat  Published on  13 Aug 2021 11:03 AM GMT
సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం బైక్ పై పిచ్చి వేశాలు

బైక్‌లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే ఫాలోవర్స్ కోసం.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం. అలాంటి ఓ బ్యాచ్ పై తాజాగా కేసు నమోదైంది. ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్‌ చేస్తున్న వీడియోను ముంబై పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీసే ఇలాంటి విన్యాసాలు చేయడం మానుకోవాలని ప్రజలను హెచ్చరించారు. రహదారి భద్రత అత్యంత ముఖ్యమని ముంబై పోలీసులు పేర్కొన్నారు. 1997 హిట్ ట్రాక్ బార్బీ గర్ల్ యొక్క లిరిక్స్‌ను మార్చి తమ రోడ్డు భద్రతా గురించి చెప్పుకొచ్చారు.' బార్బీ గర్ల్, ఇది నిజమైన ప్రపంచం. జీవితం ప్లాస్టిక్ కాదు, భద్రత ముఖ్యం. ముందు జాగ్రత్త తీసుకోండి, జీవితం నువ్వు సృష్టించుకున్నది' అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈవీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ప్రమాదకరంగా డ్రైవింగ్‌ చేసిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా వారి లైసెన్స్ కూడా సస్పెండ్ చేశారు. ఇలా స్టంట్లు చేసేటప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హెల్మెట్‌ లేకుండా.. బైక్‌ సీటుపై నిలబడటం, సీటుపై వెనక్కి తిరిగి కూర్చోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతూ ఉంటారు.



Next Story