'దాదా'తో పెట్టుకుంటే చంపేస్తాం : మేయ‌ర్‌కు బెదిరింపులు

Mumbai Mayor, Family Get Death Threat. శివసేన నేత, ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి.

By Medi Samrat  Published on  10 Dec 2021 1:18 PM IST
దాదాతో పెట్టుకుంటే చంపేస్తాం : మేయ‌ర్‌కు బెదిరింపులు

శివసేన నేత, ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో కూడా పెడ్నేకర్‌కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా పెడ్నేకర్‌కు మరాఠీలో అసభ్య పదజాలంతో రాసిన లేఖ అందింది. 'దాదా'తో చెలగాటమాడితే.. మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర‌ పరిణామాలుంటాయని లేఖలో హెచ్చరించిన‌ట్లు తెలుస్తోంది. బెదిరింపుల‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ అధికారులు మేయర్ నివాసానికి చేరుకున్నారు.

ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా మేయ‌ర్‌ పెడ్నేకర్‌కు ఫోన్‌లో బెదిరింపు వచ్చింది. ఓ వ్య‌క్తి తాను గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విష‌య‌మై పెడ్నేకర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం గుజరాత్‌కు చెందిన ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోరీ పెడ్నేకర్‌కు ప‌లుమార్లు బెదిరింపులు రావ‌డంతో శివ‌సేన నేత‌లు అల‌ర్ట్ అయ్యారు.


Next Story