అంతర్జాతీయ గోల్డ్ ట్రేడర్స్ అని చెప్పుకున్న జంట..!
Mumbai couple poses as international gold traders. బంగారం పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని మోసం చేసి ముంబై నగరంలోని
By Medi Samrat Published on 1 March 2022 2:30 PM GMTబంగారం పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని మోసం చేసి ముంబై నగరంలోని పలువురిని మోసం చేసిన జంటను బోరివిలీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పలువురి దగ్గర నుండి రూ.35 లక్షలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఆర్థిక నేరాల విభాగం 2015లో ఇదే తరహా కుంభకోణంలో దంపతులను అరెస్టు చేసింది, అయితే వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
వైశాలి అలియాస్ ప్రీతి జైన్ అలియాస్ పింకీ దమానియా, ఆమె భర్త జిగ్నేష్ దమానియా అంతర్జాతీయ బంగారు వ్యాపారులమని చెబుతూ పలువురి దగ్గర నుండి బంగారు ఆభరణాలను సేకరించారు. తమకు చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయని.. బంగారు ఆభరణాలను కస్టమ్స్‌కు ఇచ్చి తిరిగి వారి దగ్గర నుండి రా గోల్డ్ ను తీసుకుంటామని.. మార్కెట్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తామని దంపతులు బాధితులకు చెప్పారు. ఈ ప్రక్రియలో వచ్చే లాభాలను తమ బాధితులకు నెలవారీగా చెల్లిస్తామని వారు వాగ్దానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ దంపతులు ఫిబ్రవరి 26 వరకు అరెస్టు నుండి తప్పించుకుంటూ వచ్చారు. ఎప్పటికప్పుడు అపార్ట్‌మెంట్‌లను మారుస్తూ వచ్చారు. వీరికి బ్యాంకు ఖాతా కూడా లేదని అధికారులు తెలిపారు. ఈ జంట ఆటోలో పారిపోతున్నారని బోరివ్లీ పోలీసులకు ఫిబ్రవరి 26న కాల్ వచ్చిందని పోలీసు ఇన్‌స్పెక్టర్ నామ్‌దేవ్ జాదవ్ తెలిపారు. మీరారోడ్‌లోని ఓ ఫ్లాట్‌లో వారు ఉంటున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది ఫిర్యాదులు అందాయని, మోసపోయిన సొమ్ము కోట్లలో ఉండవచ్చని పోలీసులు భావిస్తూ ఉన్నారు.