ములాయం సింగ్ యాదవ్‌కు స‌తీవియోగం

Mulayam Singh Yadav's wife passes away. సమాజ్‌వాదీ పార్టీ సీనియ‌ర్ నేత‌ ములాయం సింగ్ యాదవ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  9 July 2022 3:15 PM GMT
ములాయం సింగ్ యాదవ్‌కు స‌తీవియోగం

సమాజ్‌వాదీ పార్టీ సీనియ‌ర్ నేత‌ ములాయం సింగ్ యాదవ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ములాయం భార్య సాధనా గుప్తా యాదవ్ శనివారం క‌న్నుమూశారు. నివేదికల ప్రకారం.. ఆమె కొంత‌కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండ‌టంతో కుటుంబ స‌భ్యులు నాలుగు రోజుల క్రితం మెదాంత మెడిసిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్క‌డ‌ పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు.

మొద‌ట‌ ఆమెను లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్క‌డ‌ ఆమె పరిస్థితి క్షీణించడంతో అక్క‌డినుండి ఎయిర్ అంబులెన్స్‌లో గురుగ్రామ్‌కు తీసుకువచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఉన్న ఆమెను చూసేందుకు ములాయం సింగ్ యాదవ్ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధన గుప్తా ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య. ఆమె ములాయం కంటే వ‌య‌సులో 20 సంవత్సరాలు చిన్న. ఆమె కొడుకు పేరు ప్రతీక్ యాదవ్ కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు.










Next Story