ములాయం సింగ్ కు పాదాభివందనం చేసిన స్మృతి ఇరానీ

Mulayam Singh Yadav blesses Smriti Irani as she touches his feet in Parliament. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా హాజరయ్యారు.

By Medi Samrat  Published on  31 Jan 2022 1:06 PM GMT
ములాయం సింగ్ కు పాదాభివందనం చేసిన స్మృతి ఇరానీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా హాజరయ్యారు. పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్‌లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. ములాయం సింగ్‌ యాదవ్‌ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లు, పన్ను ప్రతిపాదనలతో ఆమె తన నాల్గవ యూనియన్ బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వే 2021-22 ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలతో పాటు వృద్ధిని వేగవంతం చేయడానికి భవిష్యత్తులో అవసరమైన సంస్కరణలపై వెలుగునిస్తుందని భావిస్తూ ఉన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సమయంలో పార్లమెంటుకు విచ్చేసిన భారత రాష్ట్రపతికి ప్రధాని మోదీ, ఉభయసభల అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అత్యద్భుతమని రాష్ట్రపతి కొనియాడారు. వ్యాక్సినేషన్ తో కరోనాను కట్టడి చేస్తున్నామని, కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలసికట్టుగా మహమ్మారిపై పోరాడుతున్నాయని అన్నారు. సుదీర్ఘంగా పలు విషయాలపై మాట్లాడారు రాష్ట్రపతి.


Next Story