ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

Mukesh Ambani's Grandson, Prithvi, Seen On First Day Of School. ముకేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ ఈరోజు ముంబైలో మొదటి సారి పాఠశాలకు వెళ్ళాడు.

By Medi Samrat  Published on  15 March 2022 6:30 PM IST
ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

ముకేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ ఈరోజు ముంబైలో మొదటి సారి పాఠశాలకు వెళ్ళాడు. తన తల్లి శ్లోకా అంబానీతో కలిసి కనిపించాడు. 2019లో వివాహం చేసుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల కుమారుడు పృథ్వీ ఆకాష్ అంబానీ. ప్రస్తుతం అతడి ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి. మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్ వస్తుండగా అతని తల్లి చేతుల్లో పృథ్వీ కనిపించాడు. ఇక ఆకాష్, శ్లోకా అంబానీ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు కూడా.

పృథ్వీ ఒక పేపర్ సన్‌ఫ్లవర్ పట్టుకుని ఉండగా అతని తల్లి అతన్ని కారు దగ్గరకు తీసుకువెళ్లింది. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అతనిని పాఠశాలకు తీసుకెళ్లారు. పృథ్వీ అంబానీ భారతదేశంలో విద్యాభ్యాసం చేయబోతున్నాడని ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాష్, శ్లోక మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌లో చదువుకున్న చోటికే అతనిని పంపారు. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబం పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంది. తన క్లాస్‌లోని ఇతరుల మాదిరిగానే, పృథ్వీ హాఫ్ డేస్‌తో పాఠశాల జీవితాన్ని ప్రారంభిస్తాడని ప్రకటన పేర్కొంది. డిసెంబరులో పృథ్వీ అంబానీ మొదటి పుట్టినరోజును జరుపుకున్నాడు. పృథ్వీ అంబానీ డిసెంబర్ 10, 2020న జన్మించారు.










Next Story