బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్న ఎవరినీ వదలం, సొంత పార్టీ నేతలపై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్‌ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on  8 March 2025 8:30 AM
National News, Mp Rahulgandhi, Gujarat, Congress

బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్న ఎవరినీ వదలం, సొంత పార్టీ నేతలపై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్‌ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో పర్యటిస్తోన్న ఆయన, అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. గుజరాత్‌లో బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్న వారిని ఎవరీనీ వదలం.. అలాంటి వారందరనీ బయటకు పంపిచేస్తాం. కాంగ్రెస్‌లో నేతలకు కొదవ లేదు అని రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్‌లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేం లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని తీవ్రంగా హెచ్చరించారు. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

Next Story