వివాదాస్పద ఎంపీ విచారణకు హాజరే అవ్వలేదు..!

MP Pragya Thakur absent during court trial. భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఎన్నో వివాదాలు ఆమెను ఇప్పటికే

By Medi Samrat  Published on  19 Dec 2020 11:45 AM GMT
వివాదాస్పద ఎంపీ విచారణకు హాజరే అవ్వలేదు..!

భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఎన్నో వివాదాలు ఆమెను ఇప్పటికే చుట్టుముట్టాయి. ప్రగ్యా ఠాకూర్ 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు. 29 సెప్టెంబరు 2008న మాలేగావ్‌లో మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితులైన ఏడుగురు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా కారణంగా నిలిచిపోయిన కేసు విచార‌ణ‌ ఇటీవలే మళ్లీ మొదలైంది. నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

తాజా విచారణకు ముగ్గురు మినహా ప్రగ్యా సింగ్, రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ ద్వివేదీ, సుధాకర్ చతుర్వేదిలు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతోనే వీరు రాలేకపోయారని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రగ్యాసింగ్‌ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు.

విచారణకు హాజరుకావడానికి ప్రగ్యాసింగ్ ముంబైకి రావాలని అనుకున్నారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని అనుకున్నారని, అయితే, రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆమె వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరారని ఆమె తరపు న్యాయవాది జేపీ మిశ్రా కోర్టుకు తెలిపారు. ఆమె ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


Next Story
Share it