నాయక్ జితేంద్ర కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం

MP CM announces Rs 1 cr ex gratia, govt job to wife of Naik Jitendra Kumar. ఆర్మీ విమాన ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి

By Medi Samrat  Published on  12 Dec 2021 5:43 PM IST
నాయక్ జితేంద్ర కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం

ఆర్మీ విమాన ప్ర‌మాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి స‌హా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే బిపిన్ రావత్ ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులికల అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. కొద్దిసేప‌టి క్రితం లాన్స్‌నాయ‌క్ సాయితేజ అంత్య‌క్రియ‌లు కూడా సైనిక లాంఛ‌నాల మ‌ధ్య జ‌రిగాయి. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన మధ్యప్రదేశ్ కు చెందిన‌ నాయక్ జితేంద్ర కుమార్ వర్మ అంత్య‌క్రియ‌లు కూడా ఆదివారం జ‌రిగాయి. జితేంద్ర కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన‌ వర్మకు నివాళులు అర్పిస్తూ సీఎం చౌహాన్.. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జితేంద్ర కుమార్ కు నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుమార్తె సునీతను ప్రభుత్వోద్యోగంలోకి తీసుకుంటామ‌న్నారు. అతని పేరు మీద పాఠశాలకు అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయం అని పేరు పెడ‌తామ‌ని.. ధమండ గ్రామంలో జితేంద్ర జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మిస్తామ‌ని తెలిపారు.

జితేంద్ర కుమార్ వర్మ సెహోర్ జిల్లాకు చెందినవాడు. ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం వ‌ర్మ‌ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయ‌న‌ స్వగ్రామమైన ధామండాకు వ‌చ్చారు. వర్మ భౌతికకాయం భోపాల్‌లోని స్టేట్ హ్యాంగర్ వద్దకు చేరుకుంది. అక్కడ సైనిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, పరిపాలన అధికారులు, ప్రజలు వర్మకు నివాళులు అర్పించారు. అనంత‌రం మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సెహోర్ జిల్లాలోని వర్మ పూర్వీకుల గ్రామం ధమండాకు త‌ర‌లించారు. సీఎం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. 'అమర్‌ షహీద్‌ జితేంద్ర కుమార్‌ జీ ధమందాకే కాదు, మధ్యప్రదేశ్‌, యావత్‌ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను అని అన్నారు.


Next Story