బీజేపీపై ఎంపీ భగవంత్ మాన్.. సంచలన ఆరోపణలు.!
MP Bhagwant Mann on BJP .. sensational allegations . ఎంపీ భగవంత్ మాన్.. భారతీయ జనతా పార్టీపై సంచనల ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో వచ్చే
By అంజి
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. భారతీయ జనతా పార్టీపై సంచనల ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. తమ పార్టీలోకి రావాలంటూ బీజేపీ సీనియర్ నాయకుడు డబ్బు ఆశ చూపాడని, కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని ప్రలోభ పెట్టారని భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశాడు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ' నాలుగు రోజుల కిందట బీజేపీ సీనియర్ నాయకుడు నాతో మాట్లాడారు. తమ పార్టీలో చేరేందుకు మీరు ఏం తీసుకుంటారని, మీకు డబ్బులు కావాలా? తమ పార్టీలోకి వస్తే కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తాం' అని ఆశ చూపారని మాన్ అన్నారు.
అయితే సదరు బీజేపీ నాయకుడి పేరును చెప్పని ఎంపీ మాన్.. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. పంజాబ్‌లోని ఆప్ ఎమ్మెల్యేలను కూడా బీజేపీ నాయకులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ కాబట్టి.. పార్టీ మారిన కూడా తనకు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు. అయితే తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని ఎంపీ భగవంత్ మాన్ అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. మరో వైపు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గ విభేదాలు నెలకొన్నాయి. ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్‌సింగ్.. బీజేపీతో పొత్తుకు సిద్ధం అయ్యారు. ఆప్ పార్టీ పంజాబ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి నుండే హిట్ పుట్టిస్తున్నాయి.