దారుణం : 13 నెలల పసికందు తలను నరికిన తల్లి..!

Mother Beheads Her 13-month-old Baby, Kills Self in UP's Bulandshahr. మతిస్థిమితం లేని ఓ తల్లి.. తన 13 నెలల పసికందు

By Medi Samrat
Published on : 26 Feb 2021 10:17 AM

దారుణం : 13 నెలల పసికందు తలను నరికిన తల్లి..!

మతిస్థిమితం లేని ఓ తల్లి.. తన 13 నెలల పసికందు తలను నరికేసింది. ఆ తర్వాత ఆమె కుడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ బులందర్షహర్ జిల్లాలో జరిగింది.23 ఏళ్ల జితేంద్రి మానసికంగా అనారోగ్యానికి గురైంది. ఆమె భర్త రాజస్థాన్లో టైలర్గా పనిచేస్తున్నాడు. గురువారం.. విజయ్ నగ్లియా ప్రాంతంలోని తన నివాసంలో.. కొడుకు తలను నరికేసింది జితేంద్రి.శబ్దాలు విన్న జితేంద్రి వదిన.. ఇంటిలోకి పరుగులు తీసింది. తల్లి, బిడ్డ కనపడకపోవడం వల్ల ఇంటి పైకి వెళ్లింది.

అక్కడే.. తల లేని పసికందు శవం కనపడింది.ఇంటి వెనుక ఉన్న ఓ గదిలో జితేంద్రి శవాన్ని ఆమె వదిన గుర్తించింది. ఆ గది తలుపు లోపలి నుంచి వేసి ఉండటం వల్ల.. దానిని బద్దలు కొట్టింది. తలుపు తెరిచేసరికి జితేంద్రి ఆపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించింది. పక్కనే ఓ కొడవలి, విష పదార్థాలు కూడిన ప్యాకెట్, పాల సీసా కనిపించాయి. ఈ వివరాలను ఆమె వదిన పోలీసులకు వెల్లడించింది.జితేంద్రిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.


Next Story