క్యాన్సర్ రోగులకు ఆరోగ్య శాఖ గుడ్‌న్యూస్

More Than 25 Government Hospitals In Kerala Now Offer Chemotherapy. కేన్సర్ బాధితుల కోసం కేరళ ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి పూనుకుంది.

By Medi Samrat  Published on  11 July 2022 10:45 AM GMT
క్యాన్సర్ రోగులకు ఆరోగ్య శాఖ గుడ్‌న్యూస్

కేన్సర్ బాధితుల కోసం కేరళ ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి పూనుకుంది. కీమో థెరపీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మరో 25 కేరళ ప్రభుత్వ ఆసుపత్రులలో కీమోథెరపీ సౌకర్యాలను ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో రోగులు ఒకే సమయంలో చికిత్స తీసుకునేలా రోగులకు సహాయం చేయనుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. సుదూర ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరిన్ని కేంద్రాలలో ఆరోగ్య శాఖ క్యాన్సర్ చికిత్సను అందించడం ప్రారంభించిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పుకొచ్చారు. క్యాన్సర్ కేంద్రాలు, ఎంసీహెచ్‌లు, జిల్లా ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రులను కలిపి క్యాన్సర్ కేర్ గ్రిడ్‌గా మార్చడం ద్వారా క్యాన్సర్ సంరక్షణకు వికేంద్రీకృత విధానాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

నెడుమంగడ్, కొల్లాం, కోజెంచేరి, మావెలిక్కర, కొట్టాయం, తొడుపుజా, మువట్టుపుజా, పాలక్కాడ్, తిరుర్, పెరింతల్మన్న, నిలంబూర్, కన్నూర్, తలస్సేరిలోని ప్రభుత్వ ఆసుపత్రులు.. తిరువనంతపురం, పతనంతిట్ట, పాలా, ఎర్నాకులం, త్రిస్సూర్, తలస్సేరిలోని సాధారణ ఆసుపత్రులు మరియు మరిన్ని ఆసుపత్రులలో కీమో థెరపీ సౌకర్యాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మే నెల నుండి వారానికోసారి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ప్రారంభమైంది. క్యాన్సర్ పై అవగాహన పెంచే కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.










Next Story