పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు
Monsoon session of Parliament from July 19. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ప్రారంభం కానున్నాయని లోక్‌సభ
By Medi Samrat Published on
12 July 2021 11:28 AM GMT

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ప్రారంభం కానున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19 నుంచి ఆగస్టు 13 సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. 19 రోజుల పాటూ ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ఇవే టైమింగ్స్ వర్తిస్తాయని ఆయన వెల్లడించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని.. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 322 మంది ఎంపీలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
Next Story