పైపుల్లో లక్షల్లో డబ్బులు.. అడ్డంగా దొరికిపోయారు

Money flows out of drainage pipe in this PWD engineer's home in Karnataka. కర్ణాటక రాష్ట్రంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక

By Medi Samrat  Published on  24 Nov 2021 7:48 PM IST
పైపుల్లో లక్షల్లో డబ్బులు.. అడ్డంగా దొరికిపోయారు

కర్ణాటక రాష్ట్రంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. 60 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో పెద్ద ఎత్తున అవినీతి పరులు అడ్డంగా బుక్కయ్యారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి డ్రైనేజీ పైపులు, ఇంటి సీలింగ్‌లో దాచిన రూ.50 లక్షలకు పైగా నగదు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. చీరలలో దాచిన డబ్బు కూడా దొరికిందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

కలబుర్గీ లోని జూనియర్ ఇంజనీర్ శాంత గౌడ బిరాదార్ నివాసంపై దాడులు చేసిన అధికారులు బాత్‌రూమ్‌కు అనుసంధానించబడిన ఇంటి డ్రైనేజీ పైపులలో రూ.13.50 లక్షల విలువైన కరెన్సీ నోట్ల కట్టలను గుర్తించారు. ఇంటి సీలింగ్ నుంచి రూ.15 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వారి నివాసంలో రూ.55 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అధికారులు వారి ఆదాయానికి మించి భారీ ఆస్తులను సంపాదించుకున్నారని.. అందుకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్టీఓ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, జాయింట్ డైరెక్టర్, ఫస్ట్ డివిజన్ క్లర్క్ (ఎఫ్‌డిసి) మరియు 'డి' గ్రూప్ ఉద్యోగులపై ఈ దాడులు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫిజియోథెరపిస్ట్‌ల నివాసాలపై కూడా దాడులు నిర్వహించారు.

ఎంతసేపు తలుపు తడుతున్నప్పటికీ శాంత గౌడ్ 15 నిమిషాల పాటు తలుపు తీయకపోవడంతో హై డ్రామా నెలకొంది. శాంత గౌడ తన కుమారుడితో కలిసి వాష్‌బేసిన్ అవుట్‌లెట్‌లో నగదును దాచే పనిలో నిమగ్నమై ఉన్నారని వారు తెలుసుకున్నారు. అధికారులు లోపలికి ప్రవేశించిన తర్వాత పైపును తెరిచి రూ.13.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శాంత గౌడ్‌కు తన తండ్రి నుంచి వారసత్వంగా రెండు ఎకరాల భూమి ఉందని, ప్రస్తుతం కలబురగి సమీపంలో 35 ఎకరాలకు పైగా భూమి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.



Next Story