ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు మోదీ బ‌ర్త్ డే విషేస్‌

Modi Wishes Rajani And Sharad Pawar. ప్రధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  12 Dec 2020 4:09 AM GMT
ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు మోదీ బ‌ర్త్ డే విషేస్‌

ప్రధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌‌యం తెలిసిందే. స‌మ‌కాలీన విష‌యాల‌పై స్పందించ‌డంతో పాటు.. ప్ర‌ముఖుల జ‌న్మ‌దినం రోజున‌ శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేస్తారు. తాజాగా మోదీ..‌ కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ప్రముఖ నటుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు ట్విట‌ర్ వేదిక‌గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఇరువురు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్లు‌ చేశారు. శరద్‌ పవార్‌ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మహ‌రాష్ట్ర రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌గా గుర్తింపు పొందిన‌ శరద్‌ పవార్‌ 1940, డిసెంబర్‌ 12న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు.ఇక‌, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కూడా ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన రజనీ కాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్‌ చేశారు. రజనీకాంత్ నేడు 70వ వ‌డిలోకి అడుగుసెడుతున్నారు. గత ఆగస్టులో 45 ఏళ్ల‌ సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్న ర‌జ‌నీ.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్‌ 4న ప్రకటించారు. ఈనెల చివర్లో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని తెలిపారు.


Next Story