లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకు రావొద్దు
Modi Speech About Second Wave. కరోనా రెండో దశలో దేశ ప్రజలపై విరుచుకు పడుతున్న నేఫథ్యంలో జాతికి ధైర్యం చెప్పేందుకు
By Medi Samrat Published on 20 April 2021 9:45 PM ISTకరోనా రెండో దశలో దేశ ప్రజలపై విరుచుకు పడుతున్న నేఫథ్యంలో జాతికి ధైర్యం చెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తమ పరిసరాల్లో కొంత మంది కలిసి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కోవిడ్‌పై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇలా చేసి లాక్‌డౌన్ నుంచి మనల్ని మనం కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.
రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతున్నది. రెండో దశలో తుపాన్ వలే విరుచుకు పడుతున్నది. కరోనాను నియంత్రించడానికి అహర్నిశలు క్రుషి చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలమని.. ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో పరిస్థితులను చక్కదిద్దుతాయని అన్నారు.
మే 1వ తర్వాత కూడా 45 ఏళ్లు దాటిన వారికి టీకాల ప్రక్రియ కొనసాగుతుంది. 18 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేస్తే దేశంలోని వివిధ నగరాల్లో సత్ఫలితాలు వస్తాయి. యువకులు టీమ్‌లుగా ఏర్పడి ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందని.. డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని.. కొత్త వ్యాక్సిన్లకు ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో అనుమతులు ఇచ్చామని అన్నారు. 12 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందయ్యిందని.. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా చర్యలు తీసుకున్నామని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. లాక్ డౌన్ విధించే పరిస్థితి తీసుకు రావొద్దని అన్నారు.