మోడీ గారూ.. ఇది చూశారా..? రైతుల బాధ‌లు వినండి : ప్రియాంకా గాంధీ

Modi ji have you seen this asks Priyanka Gandhi.ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌లోని ఖేరీ గ్రామంలో చోటుచేసుకున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2021 8:12 AM GMT
మోడీ గారూ.. ఇది చూశారా..?  రైతుల బాధ‌లు వినండి : ప్రియాంకా గాంధీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌లోని ఖేరీ గ్రామంలో చోటుచేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌పై విప‌క్షాలు, రైతు సంఘాల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ప్రధాని మోడీ లక్నోలో పర్యటించడానికి కొద్ది గంటలకు ముందే కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ.. రైతులపై ఎస్‌యూవీ దూసుకుపోయిన సంచలన వీడియోను ట్వీట్ చేశారు. ప్ర‌ధాని గారూ ఈ వీడియోని చూశారా..? నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రిని ఇంకా ఎందుకు తొల‌గించ‌లేదో దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని చెప్పాన్నారు.

'న‌రేంద్ర మోదీ గారూ.. మీ ప్ర‌భుత్వం ఎటువంటి ఎలాంటి ఉత్తర్వులు చూపకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా న‌న్ను 28 గంట‌లుగా క‌స్ట‌డీలో ఉంచింది. అయితే.. అన్న‌దాత‌లు(రైతుల‌ను) పై నుంచి వాహానాన్ని ఎక్కించిన ఆ వ్య‌క్తిని ఇంత వ‌ర‌కూ అరెస్ట్ చేయ‌లేదు. ఎందుకు..?' అని ట్వీట్ చేయ‌డంతో పాటు వైర‌ల్ వీడియోను కూడా జ‌త చేశారు. రైతులపై ఏస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) దూసుకుపోతుండగా.. రైతులు చెల్లాచెదురుగా పరిగెడుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ల‌ఖింపుర్ ఖేరి ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన న‌లుగురు రైతుల మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక వచ్చింది. షాక్ కు గురికావ‌డం, అధిక రక్తస్రావం వ‌ల్లే మృతి చెందార‌ని, మృతుల శ‌రీరాల‌పై ఎటువంటి బుల్లెట్ గాయాలు లేవ‌ని చెప్పింది. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు స‌హా తొమ్మిది మంది మృతి చెందారు. కాగా.. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 45 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని చెప్పింది.

Next Story
Share it