దీపావళికి ముందే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
దీపావళికి ముందే దేశంలోని రైతులకు పెద్ద కానుకను అందించింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
By Medi Samrat Published on 25 Oct 2023 4:41 PM ISTదీపావళికి ముందే దేశంలోని రైతులకు పెద్ద కానుకను అందించింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఇది కాకుండా వ్యవసాయ భూమిని సాగునీటి పథకాలకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు ఎన్‌బీఎస్ కింద రైతులకు ఎరువుల సబ్సిడీని అందజేయనున్నట్లు తెలిపారు.
బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై తీర్మానాలు చేశారు. వీటిలో అతిపెద్ద నిర్ణయం దేశంలోని రైతులకు సంబంధించినది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎరువుల ధరలను ఒక్క రూపాయి కూడా పెంచబోమని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రైతులకు ఎరువుల సబ్సిడీ కూడా కొనసాగుతుందన్నారు. అందువల్ల ఎరువుల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు శ్రేయోభిలాషి అని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినా.. మన రైతులపై మాత్రం భారం ఏమాత్రం పెరగడం లేదన్నారు. అక్టోబరు 1, 2023 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు రైతులకు మునుపటిలాగానే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రబీ సీజన్ 2023-2024 కోసం ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువులపై ప్రభుత్వం పోషకాల ఆధారిత సబ్సిడీని అందిస్తోంది.