అలా చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుంది

Modi About Employment. నైపుణ్యాలు కలిగిన యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం.. తదితర రంగాల్లో

By Medi Samrat  Published on  3 March 2021 9:21 AM GMT
Modi About Employment

నైపుణ్యాలు కలిగిన యువతకు అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం.. తదితర రంగాల్లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగం కేటాయింపులపై నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. యువత జ్ఞానాన్ని, పరిశోధనను పరిమితం చేస్తే దేశ సామర్థ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

2021-22 బడ్జెట్లో వైద్య రంగం తర్వాత అత్యధికంగా విద్యారంగంపైనే దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. విద్య, ఉపాధి అనుసంధానమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించామన్నారు. దాని ఫలితమే సాంకేతిక పరిశోధనల పబ్లికేషన్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉందన్నారు.

భారతీయ భాషలను ప్రోత్సహించేందుకే నూతన విద్యావిధానం. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని భారతీయ భాషల్లోకి అనువదించేలా దేశంలోని భాషా నిపుణులు కృషి చేయాలి. ఈ సాంకేతిక యుగంలో ఇది సాధ్యమే. 'ఆత్మనిర్భర్ భారత్'ను నిర్మించాలంటే యువతలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. యువత.. తమ విద్య, నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది అని అన్నారు.


Next Story