5 రోజుల పాటూ రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Mobile internet services suspended in Manipur for 5 days. మణిపూర్ ప్రభుత్వం శనివారం (ఆగస్టు 6, 2022) నుంచి మొత్తం రాష్ట్రంలో మొబైల్ డేటా సేవలను

By Medi Samrat  Published on  7 Aug 2022 5:59 AM GMT
5 రోజుల పాటూ రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

మణిపూర్ ప్రభుత్వం శనివారం (ఆగస్టు 6, 2022) నుంచి మొత్తం రాష్ట్రంలో మొబైల్ డేటా సేవలను 5 రోజుల పాటు నిలిపివేసింది. స్పెషల్ సెక్రటరీ (హోమ్) హెచ్ జ్ఞాన్ ప్రకాష్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బిష్ణుపూర్‌లో ఒక వ్యాన్‌ను 3-4 మంది యువకులు తగులబెట్టడంతో మణిపూర్ అంతటా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో మొబైల్ డేటా సేవలను ఐదు రోజుల పాటు నిలిపివేశారు. ఈ ఘటన అస్థిర శాంతిభద్రతల పరిస్థితిని సృష్టించిందని రాష్ట్ర హోం శాఖ పేర్కొంది.

చురాచంద్‌పూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో రాబోయే రెండు నెలల పాటు సెక్షన్ 144 ను అమలు చేయనున్నారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట నిరవధిక దిగ్బంధనం విధించడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. మణిపూర్ (కొండ ప్రాంతాలు) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లు 2021ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.


Next Story