రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసు స్టేషన్‌ను లూటీ చేశారు..!

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక గుంపు పోలీసు స్టేషన్‌లోకి చొరబడి ఆయుధాలను దోచుకుంది

By Medi Samrat  Published on  3 Oct 2024 3:03 PM GMT
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసు స్టేషన్‌ను లూటీ చేశారు..!

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక గుంపు పోలీసు స్టేషన్‌లోకి చొరబడి ఆయుధాలను దోచుకుంది. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివాదాస్పద భూమిని శుభ్రం చేసే క్రమంలో బుధవారం రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు.

రెండు గ్రూపుల సభ్యులు నాగా సామాజికవర్గానికి చెందినవారు, కానీ వేర్వేరు గ్రామాల నివాసితులు. ఆ భూమిపై రెండు వైపుల వారు హక్కుదారులున్నారు. ఘర్షణ నేపథ్యంలో నగరంలో నిషేధాజ్ఞలు విధించారు. ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి.

ఇంతకు ముందు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు దోచుకున్నారు. అయితే ఆ ప్రాంతాలలో మెయిటీ లేదా కుకీ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండేది. నాగా ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ పోలీస్ స్టేషన్ అస్సాం రైఫిల్స్ క్యాంపు నుండి కొన్ని మీటర్ల దూరంలో ఉంది.

Next Story