రాహుల్ గాంధీకి అండగా నిలబడుతాం : జగ్గారెడ్డి

MLA Jagga Reddy Responds on Rahul Gandhi Disqualified. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.

By Medi Samrat
Published on : 24 March 2023 8:45 PM IST

రాహుల్ గాంధీకి అండగా నిలబడుతాం : జగ్గారెడ్డి

MLA Jagga Reddy


రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ పై ఎంపీ గా అనర్హత వేటు వేయడం రాజకీయ కుట్రేన‌ని అన్నారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కుటుంబం ఉండకూడదనే బీజేపీ మొదటి నుండి కుట్ర చేస్తుందని ఆరోపించారు. భవిష్యత్తు రాజకీయాల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొలేని పరిస్థితి వస్తుందనే కోర్టు జడ్జిమెంట్ ని అవకాశంగా తీసుకొని ఆగమేఘాలపై రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం జరిగిందని జ‌గ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఉభయసభల‌లో పదే పదే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆదానీ-హిండెన్ బర్గ్ అంశం ప్రస్థావించడం తో బీజేపీ రాహుల్ గాంధీ పై ఈ కుట్ర చేసిందని ఆయ‌న అన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము రాహుల్ గాంధీకి అండగా నిలబడుతాం అని జ‌గ్గారెడ్డి తెలిపారు.


Next Story