ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే..!

MLA caught on camera slapping Karnataka college principal. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓ ప్రిన్సిపాల్ ను కొట్టడం హాట్ టాపిక్ గా మారింది

By Medi Samrat  Published on  22 Jun 2022 9:45 AM GMT
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే..!

జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ ఓ ప్రిన్సిపాల్ ను కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. జూన్‌ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను ఆయన తన మందీ మార్బలంతో సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్‌ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. కాలేజీ ప్రిన్స్‌పాల్‌.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి సమాధానాలు చెబుతూ వచ్చాడు. అయితే ఎమ్మెల్యే శ్రీనివాస్‌.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్‌ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నల్వడి కృష్ణరాజ వడియార్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌పై మండ్య ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్‌ పలుమార్లు చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్‌ పట్ల శ్రీనివాస్‌ ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారని ప్రజలు మండిపడ్డారు. ఒక మహిళతో సహా ఎమ్మెల్యే సహచరులు, స్థానిక రాజకీయ నాయకుల ముందు రెండుసార్లు కొట్టాడు. ఎమ్మెల్యేను శాంతింపజేసేందుకు అక్కడున్న వారు ప్రయత్నిస్తూ ఉన్నారు.


Next Story
Share it