రామేశ్వరం కేఫ్ లో పేలుడు

బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి.

By Medi Samrat  Published on  1 March 2024 3:42 PM IST
రామేశ్వరం కేఫ్ లో పేలుడు

బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది, ఒక కస్టమర్ ఉన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, మధ్యాహ్నం 1 గంటలకు ఓ బ్యాగ్‌లో ఉంచిన వస్తువు పేలిపోయింది. క్షతగాత్రులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, క్షేమంగా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.

రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించడంతో వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ కేఫ్ బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్‌లలో ఒకటి. పోలీసు అధికారులు, అగ్నిమాపక అధికారులు, కేఫ్ బయట ఉన్న విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఫోరెన్సిక్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Next Story