పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నదియా హన్స్‌ఖాలీలో మైనర్‌పై జరిగిన అత్యాచారానికి సంబంధించి కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మైనర్ బర్త్ డే పార్టీకి వెళ్లిన సమయంలో అత్యాచారానికి గురైంది. ఆమె ఆదివారం మృతి చెందింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడి ఒత్తిడి మేరకు శవపరీక్ష చేయకుండానే మృతదేహాన్ని దహనం చేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సోమవారం రాణాఘాట్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ పిటిషనర్‌కు పిఐఎల్‌ను దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రేపు విచారణ ప్రారంభం కావచ్చని అంటున్నారు. బీర్భూమ్ అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరచిపోకముందే.. ఈ దారుణం చోటు చేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రజలను ఎంతగానో వేధిస్తోందని ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపిస్తోంది.