Hanuman Jayanti : అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
MHA Issues Advisory To All States for Hanuman Jayanti After Ram Navami Violence. రామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 5 April 2023 9:38 AM GMTప్రతీకాత్మక చిత్రం
రామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. హనుమాన్ జయంతి దృష్ట్యా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఏప్రిల్ 6వ తేదీన హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలో "శాంతిభద్రతలను కాపాడాలని, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై నిఘా ఉంచాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ట్వీట్ చేసింది.
The MHA has issued an advisory to all states in preparation for Hanuman Jayanti. The governments are encouraged to ensure the maintenance of law and order, peaceful observance of the festival, and monitoring of any factors that could disturb communal harmony in society.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) April 5, 2023
దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఢిల్లీ పోలీసు సిబ్బంది జహంగీర్‌పురి ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీ పోలీసులతో పాటు, పారా మిలిటరీ సిబ్బంది కూడా జహంగీర్‌పురిలో ఉన్నారు. గత సంవత్సరం జహగీర్‌పురి ప్రాంతంలోని జి బ్లాక్‌లో హనుమాన్ జయంతి శోభా యాత్రపై రాళ్ల దాడి జరిగి హింస చెలరేగింది.
రామ నవమి సందర్భంగా.. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది. బీహార్, బెంగాల్‌లలో బాంబులు పేల్చడంతో పాటు రాళ్లదాడి కూడా జరిగింది. ప్రస్తుతం కూడా పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో హింసాకాండ మళ్లీ మళ్లీ రాజుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది
బుధవారం కలకత్తా హైకోర్టు హనుమాన్ జయంతికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో భద్రతను కొనసాగించాలని, కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. 144 సెక్షన్ విధించిన ప్రాంతాల్లో హనుమాన్ జయంతి రోజు ఊరేగింపులు జరపరాదని హైకోర్టు పేర్కొంది.