మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ఈరోజు విలేకరుల సమావేశంలో పేర్కొంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. రానున్న ఎన్నికల కోసం మేఘాలయలో మొత్తం 3,482 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మేఘాలయ శాసనసభ పదవీకాలం మార్చి 15, 2023తో ముగియనుంది.
గతంలో 2018 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మేఘాలయలో ఎన్నికల తరువాత.. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాన్రాడ్ కొంగల్ సంగ్మా ముఖ్యమంత్రి పీఠాన్ని స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలు నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఏకైక పార్టీ ఎన్‌పిపి.
ఇప్పటి వరకు దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు మేఘాలయలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజీనామా చేశారు. దీంతో సభ బలం 60 నుంచి 47కి తగ్గిందని అసెంబ్లీ కమిషనర్, సెక్రటరీ ఆండ్రూ సైమన్స్ పిటిఐకి తెలిపారు.