బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీలోని అన్ని పదవుల నుండి తొలగిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఆకాష్ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుండి తొలగించారు. కీలకమైన పార్టీ సమావేశం తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్‌తో పాటు రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కొత్తగా జాతీయ సమన్వయకర్తలుగా నియమించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బహుజన సమాజం అభివృద్ధి చెందడం, రాష్ట్ర ప్రగతికి మాత్రమే కాకుండా యావత్ దేశాభివృద్ధికి అవసరమని మాయావతి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.